- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాన్సువాడలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాలపై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాలపై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కే.ఆర్. సురేష్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ జడ్పీ చైర్మన్లు దఫేదార్ రాజు, విఠల్‌రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, ఉద్యోగాల కల్పన వంటి హామీలు అమలు కాలేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల పట్ల అప్రమత్తంగా ఉండి అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో బాన్సువాడ నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చాయని, ప్రస్తుతం అభివృద్ధి పనులు మందగించాయని విమర్శించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ, బాన్సువాడలో బీఆర్ఎస్ కార్యకర్తలు చురుకుగా పనిచేస్తున్నారని, సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా ఇన్‌చార్జి విజి గౌడ్ మాట్లాడుతూ.. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ గత పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కే.ఆర్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగించకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి తోట ఆగయ్య, జిల్లా ఇన్‌చార్జి విజి గౌడ్, అంజిరెడ్డి, జుబేర్, నార్ల రత్నకుమార్, యలమంచిలి శ్రీనివాస్, షేక్ అక్బర్, బాడీ శ్రీను, సుధాకర్ యాదవ్‌తో పాటు అన్ని మండలాలు, గ్రామాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.






