- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి బీసీ, ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ప్రభుత్వాన్ని కోరారు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి బీసీ, ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించి, వారిని భవిష్యత్తులో ముందుకు వెళ్ళేందుకు కృషి చేయాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక జిల్లా ప్రెస్ క్లబ్‌లో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో 'విద్యా హక్కు చట్టం-ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 90 శాతం ఉన్న అణగారిన వర్గాల పక్షాలు ఆర్ధికంగా, సామాజికంగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కొత్త జీఓను రద్దు చేస్తూ, పాత పద్ధతిని అవలంబించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కోటాను అమలుచేయడానికి..
నూతన జీఓ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేయడాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. విశ్రాంత డిఇఓ విజయ కుమార్, బెక్కెం జనార్దన్‌లు మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రైవేటు విద్యా సంస్థలు చట్టంలోని సెక్షన్ 12(1)(సీ) ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. పేద విద్యార్థులకు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ల కింద సీట్లు కేటాయించినప్పటికీ, ఆ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు చెల్లించనందున, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ కోటాను అమలుచేయడానికి విముఖత చూపుతున్నాయని వారు ఆరోపించారు. వెంటనే విద్యా హక్కు చట్టాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్‌ను అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలకు నాంది పలకాల్సివస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గన్న, సారంగి లక్ష్మీకాంత్, అశ్విని సత్యం, మున్నూరు జైపాల్, చెన్నయ్య, కృష్ణయ్య, భరత్, నర్సింహ, జుర్రు నారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.






