- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్‌లో అమరవీరుల స్థూప స్థలాన్ని కాపాడాలి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గతంలో కూల్చివేసిన అమరవీరుల స్థూపం స్థలాన్ని, దాని పరిధిలోని నాలుగు ఎకరాల సీలింగ్ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గతంలో కూల్చివేసిన అమరవీరుల స్థూపం స్థలాన్ని, దాని పరిధిలోని నాలుగు ఎకరాల సీలింగ్ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సీపీఐ, జేఏసీ నాయకులతో కలిసి వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. గతంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ స్థలాన్ని సందర్శించి, భూమిని కాపాడుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చాడ గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై పురపాలక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూములను కాపాడటానికి జేఏసీతో కలిసి ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అందె స్వామి, జాగీర్ సత్యనారాయణ, గడిపె మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలి
గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి, బిల్లులు రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చాడ వెంకటరెడ్డి కోరారు. ఆదివారం సంపత్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న సర్పంచుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






