చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి: మంత్రి నిమ్మల

by Vemula.Srinu Prasad |

కలళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ మరింత బలపడడానికి తన వంతు కృషి చేస్తానని ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ..

చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి: మంత్రి నిమ్మల
X

దిశ, పాలకొల్లు: కలళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో రాబోయే రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ మరింత బలపడడానికి తన వంతు కృషి చేస్తానని ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లైన్స్ కమ్యూనిటీ హాల్లో అల్లూరి సీతారామరాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల లో పాడుతా హాయిగా పేరుతో సినీ పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ 15 మందికి ధ్రువీకరణ పత్రాలు మంత్రి నిమ్మల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నిమ్మల మాట్లాడారు.

పాలకొల్లు చరిత్రను ప్రపంచం నలు దిక్కుల వ్యాపింప జేసిన ఘనత పాలకొల్లు కళాకారులుదేనని మంత్రి నిమ్మల అన్నారు. తీర ప్రాంతం, పర్యాటక, టెంపుల్ టూరిజం,ఫిల్మ్ ఇండస్ట్రీ బలపడడానికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రలు మంత్రి నిమ్మల అందజేశారు. మాజీ ఎంపీ చెగొండి హరి రామ జోగయ్య మాట్లాడుతూ పాలకొల్లుకి ఫిలిం ఇండస్ట్రీ రావాల్సిన అవశ్యకత ఉందని, దీని కోసం మంత్రి రామానాయుడు, గాంధీ భగవాన్ రాజు కృషి చేయాలని కోరారు. ఫిలిం ఇనిస్టిట్యూట్ గౌరవాధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విజయవంతంగా నిర్వహించడానికి మంత్రి నిమ్మల రామానాయుడు, మినిస్టర్ డైరెక్టర్ రాజా వనం రెడ్డి కృషితో విజయవంతంగా సాగుతోందన్నారు.

Next Story