Vedanta: ప్రభుత్వ ఖజానాకు రూ. 62,722 కోట్లు చెల్లించిన వేదాంత

by S Gopi |

ఇది గతేడాదితో పోలిస్తే 13.3 శాతం పెరగడమే కాకుండా, కంపెనీ చరిత్రలో రెండవ అత్యధిక వార్షిక పన్ను చెల్లింపు కావడం గమనార్హం.

Vedanta: ప్రభుత్వ ఖజానాకు రూ. 62,722 కోట్లు చెల్లించిన వేదాంత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రభుత్వానికి భారీగా పన్నులు చెల్లించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు సంస్థ రూ. 62,722 కోట్లు చెల్లించింది. ఇది గతేడాదితో పోలిస్తే 13.3 శాతం పెరగడమే కాకుండా, కంపెనీ చరిత్రలో రెండవ అత్యధిక వార్షిక పన్ను చెల్లింపు కావడం గమనార్హం. ఈ మొత్తం కంపెనీ 2025-26 కన్సాలిడేటెడ్ ఆదాయంలో సుమారు 36 శాతం వాటాను సూచిస్తోంది. బలమైన ఆర్థిక పనితీరు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. సంస్థ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 1.74 లక్షల కోట్లకు చేరగా, నికర లాభం 22 శాతం పెరిగి రూ. 25,096 కోట్లకు చేరినట్టు కంపెనీ వెల్లడించింది. ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం పన్నులో జింక్ వ్యాపారం నుంచే అత్యధికంగా రూ. 19,053 కోట్లు అందించగా, అల్యూమినియం రూ. 15,788 కోట్లు, ఆయిల్ అండ్ గ్యాస్ రూ. 11,697 కోట్లతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. గత దశాబ్దంలో వేదాంత మొత్తం ప్రభుత్వ ఖజానాకు రూ. 4.83 లక్షల కోట్లకుపైగా చెల్లించడం ద్వారా దేశంలో అత్యధిక పన్ను కట్టే దిగ్గజ ప్రైవేట్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. రాయల్టీలు, పరోక్ష పన్నులు, ఎగుమతి–దిగుమతి సుంకాలు, జీఎస్టీ, విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు, డివిడెండ్ల రూపంలో ఈ భారీ మొత్తం ప్రభుత్వానికి సమకూరింది.

Next Story