పేకాట స్థావరం పై పోలీసుల దాడి...

by Taduka Kalyani |

శివంపేట మండలంలోని కోతాపేట గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో చట్టవ్యతిరేకంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శివంపేట పోలీసులు ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

పేకాట స్థావరం పై పోలీసుల దాడి...
X

దిశ, తూప్రాన్ : శివంపేట మండలంలోని కోతాపేట గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో చట్టవ్యతిరేకంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శివంపేట పోలీసులు ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.22,930 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మండల పరిధిలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శివంపేట ఎస్‌ఐ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Next Story