- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీభవన్ ‘ప్రజలతో ముఖాముఖి’ కమిటీ నియామకం
by Ramesh Naini |
గాంధీభవన్‌లో ప్రతి బుధవారం మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించే ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీపీసీసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్‌లో ప్రతి బుధవారం మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించే ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీపీసీసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత సంగిశెట్టి జగదీశ్వర్ రావు, కన్వీనర్‌గా మద్దుల గాల్ రెడ్డిని నియమిస్తూ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హైమావతి, మద్దెల సంతోష్ ముదిరాజ్, వంశీకృష్ణ పెండ్యాల నియమితులయ్యారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. అంతేకాకుండా, ప్రజలు ఇచ్చే అర్జీలపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమస్యల పరిష్కారానికి తుది చర్యలు తీసుకునేలా ఈ కమిటీ పనిచేస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
Next Story






