- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో వేధింపులు.. హోం గార్డుపై కేసు నమోదు !
ప్రేమ పేరుతో వివాహిత మహిళను వేధింపులకు గురిచేస్తున్న హోం గార్డు పై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

X
దిశ, చైతన్యపురి : ప్రేమ పేరుతో వివాహిత మహిళను వేధింపులకు గురిచేస్తున్న హోం గార్డు పై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్, చైతన్యపురి పరిధిలో నివసించే ఓ వివాహితను ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. వీరిద్దరికీ వివాహాలు కాగా, పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ, మహిళ వెంటపడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Next Story






