- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి తాళం పగులగొట్టి రూ.30 వేల నగదు చోరీ...
by Taduka Kalyani |
కుల్కచర్ల మండలం ఎర్రగోవింద్ నాయక్ తండా పరిధిలోని ఒంటి గుడిసె తండాలో ఇంటి తాళం పగులగొట్టి రూ.30 వేలు నగదు చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

X
దిశ,కుల్కచర్ల : కుల్కచర్ల మండలం ఎర్రగోవింద్ నాయక్ తండా పరిధిలోని ఒంటి గుడిసె తండాలో ఇంటి తాళం పగులగొట్టి రూ.30 వేలు నగదు చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 26 రాత్రి బాణావత్ సంతోష్ నాయక్ ఇంటిలో తాళం పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు జూన్ 27న డయల్-100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి వేలిముద్రలు, పాదముద్రలు వంటి ఆధారం సేకరించారు. ఈ కేసులో నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసేందుకు శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Next Story






