- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flipkart: ఫ్లిప్‌కార్ట్ 'గోట్ సేల్‌లో ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ తగ్గింపులు
మెమొరీ చిప్ కోరత వల్ల రానున్న రోజుల్లో ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, ఈ సేల్ కస్టమర్లకు మంచి అవకాశమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘గోట్ సేల్’ సందర్భంగా ఐఫోన్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్17పై ఏకంగా రూ.12 వేలు, ప్రో మోడల్స్‌పై రూ.22 వేల వరకు డిస్కౌంట్‌లను ఆఫర్ చేసింది. ఇప్పటికే ఐఫోన్‌లు మినహా అన్ని యాపిల్ ఉత్పత్తుల ధరలు పెరిగిన నేపథ్యంలో, మెమొరీ చిప్ కోరత వల్ల రానున్న రోజుల్లో ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, ఈ సేల్ కస్టమర్లకు మంచి అవకాశమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గోట్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 17 ధర రూ. 82,900 నుంచి రూ. 70,900కు తగ్గనుండగా, ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,34,900 నుంచి రూ. 1,12,900కు, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,49,900 నుంచి రూ. 1,27,900కు తగ్గనుంది. వీటికి తోడు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉండటంతో కొనుగోలుదారులు మరింత తక్కువ ధరకు ఫోన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. జూలై 4 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే యాక్సెస్ లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా 5జీ(12జీబీ+256జీబీ)పై భారీ తగ్గింపు ప్రకటించింది. రూ. 1,29,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్, రూ. 90,000లోపు ధరకు లభించనుంది. జూలై 4–6 మధ్య జరిగే ప్రైమ్ డే సేల్‌లో ఈ డీల్ అందుబాటులో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే అదనంగా 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.






