- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుతో మహిళ మృతి
by Taduka Kalyani |
పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తిరుమలపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, నర్సాపూర్ : పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తిరుమలపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన విటల్ సరిత (38) గేదెలను మేపడానికి తన కుమారుడిని తీసుకొని పొలం వద్దకు వెళ్లడం జరిగింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో ఆమె ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో విటల్ సరిత అక్కడికక్కడే మృత్యువాత చెందింది. 12 ఏండ్ల తన కుమారుడు కొద్ది దూరంలో ఉండడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అయినప్పటికీ బాలుడు దగ్గరలో ఉండడంతో ఆ పిడుగుపాటుకు నడవలేక పోతున్నాడని గ్రామస్తులు తెలిపారు. పిడుగు పడిన చోట గుంత ఏర్పడిందని చూసిన గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ కు తరలించారు.
Next Story






