- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ గుగులోత్ రాంబాబు
కొత్తగూడెంమున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 32వ డివిజన్ నవభారత్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్ గుగులోత్ రాంబాబు ప్రారంభించారు.

దిశ, పాల్వంచ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 32వ డివిజన్ నవభారత్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్ గుగులోత్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో టీకాలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన సొంత ఖర్చుతో టెంటు, కుర్చీలు, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాంబాబు మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం సుజాత, అంగన్‌వాడీ కార్యకర్త జమునతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నవభారత్ ఆనంద్, గాజుల కిరణ్, దేశినేని సంతోష్, భూక్య సాయికృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు.






