BRS: ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

BRS: ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 24 నెలల వైఫల్య పాలనలో గత ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయని, వ్యాపారాలు తగ్గిపోయాయని, ఉపాధి దొరకకుండా పోయిందని అన్నారు. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, వారి అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ అత్యంత నిష్టతో పనిచేశారని అన్నారు. నగరంలో పది సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పది సంవత్సరాల కింద హైదరాబాద్‌లో ఉన్న కరెంట్ కోతలు, తాగునీటి తిప్పలు, అస్తవ్యస్తపు రోడ్లను హైదరాబాద్ నగర ప్రజలు చూసినారని అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు హైదరాబాద్ మరియు ఇతర పట్టణాల్లో విస్తృతమైన తాగునీటి ప్రాజెక్టుల ద్వారా తాగునీటి సమస్యలు 90 శాతం పైగా పరిష్కరించామని తెలిపారు. కరోనా సమయంలో కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశామని పేర్కొన్నారు.

పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మని చెప్పుకుంటూ, స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటున్నారని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని అన్నారు. రాజేంద్రనగర్‌కు వచ్చే ఏర్పాటు చేసిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినందుకు సీఎంతో కలిసి పోయిండా అనే విషయం చెప్పాలని కేటీఆర్ అన్నారు.

Next Story