తల్లిపాలు/ఫార్ములా మిల్క్.. రెండింటిలో పిల్లలకు ఏవి మంచివి..?

by Kodari Anjali |

బిడ్డకు తల్లిపాలే మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

తల్లిపాలు/ఫార్ములా మిల్క్.. రెండింటిలో పిల్లలకు ఏవి మంచివి..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిడ్డకు తల్లిపాలే మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొంతమంది తల్లిపాలు సరిపోక పిల్లలకు డబ్బా పాలు కూడా పట్టిస్తుంటారు. తల్లిపాలను కొన్ని స్వల్ప.. దీర్ఘకాలిక వ్యాధులు నుంచి శిశువులను రక్షించడంలో సహాయపడుతాయి. తల్లిపాలు తాగే పిల్లలకు ఆస్తమా, ఊబకాయం, టైప్ 1 మధుమేహం, ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ (SIDS) వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

తల్లిపాలు శిశువులకు ఉత్తమ పోషకాహారం అని చెప్పుకోవచ్చు. తల్లిపాలను తాగే శిశువులకు రోగనిరోధక శక్తి పెరుగడమే కాకుండా, జ్జాపకశక్తి పెరుగుతుంది. తల్లిపాల వల్ల తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తల్లిపాలు బిడ్డలకు పోషకాలు అందిస్తాయి. అలాగే తల్లిపాలు తాగే శిశువులకు చెవి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

అయితే తాజాగా ఇన్‌‌ఫ్యాంట్ ఫార్ములా పాలలో.. తల్లిపాలతో సమానంగా పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. నవజాత శిశువుల డైజెస్టివ్ సిస్టమ్‌కు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రసవం తర్వాత తల్లి ఎదుర్కొనే సాధారణ సమస్య బిడ్డకు పాలు సరిపోకపోవడం. కాగా ఈ క్రమంలో ఫార్ములా మిల్క్ పట్టిస్తుంటారు.

తల్లిపాలతో సమానంగా వీటిలో పోషకాలు ఉన్నప్పటికీ బ్రెస్ట్‌‌ఫీడ్ వల్ల కొన్ని ప్రత్యేకమైన లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే యాంటీబాడీలు, ప్రీబయాటిక్స్‌, ప్రోబయాటిక్స్‌, ఎంజైమ్స్‌ వంటి బయోయాక్టివ్‌ కాంపొనెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కడుపులో మంచి, గట్‌ బ్యాక్టీరియాను డెవలప్ చేస్తాయి.

బ్రెస్ట్‌ మిల్క్‌లో ‘హ్యూమన్‌ మిల్క్‌ ఓలిగోశాకరైడ్స్ (HMO)’ ఉంటాయి. ఇవి ప్రీబయాటిక్స్‌లా పనిచేస్తాయి. చిన్నారుల్లో అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. కాగా పిల్లలకు తల్లి రొమ్ముపాలే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఫార్ములా మిల్క్ కూడా మంచివే కానీ ముందుగా తల్లిపాలకు ప్రాధాన్యత ఇస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్యాంట్ ఫార్ములా పాలల్లో బైఫిడోబ్యాక్టీరియా లాంటి హెల్తీ బ్యాక్టీరియా కొన్ని మాత్రమే ఉంటాయని.. కానీ సహజమైన ఎంజైమ్స్ ఉండవకని నిపుణులు అంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story