- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వోటింగ్ లో రికార్డులు బద్దలు
గురువారం జరిగిన కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్ : గురువారం కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ జరిగిన ఈ మూడు రాష్ట్రాల్లో వోటింగ్ లో పాత రికార్డులు బద్దలయ్యాయి. కేరళంలో 140 నియోజక వర్గాలు ఉండగా.. గత ఎన్నికల్లో 74.06శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 78 శాతానికి పెరిగింది. అలాగే అస్సాంలో 126 నియోజక వర్గాలు ఉండగా.. గత ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 85 శాతానికి పెరిగింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో 30 నియోజక వర్గాల్లో సాయంత్రం 7 గంటల సమయానికి అత్యధికంగా 90 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ పెరగగా.. ఈ పెరుగుదల ఎవరికి మేలు చేస్తుందో, ఎవరిని గద్దెను ఎక్కిస్తుందో మే 4 వరకు వేచి చూడాల్సిందే. కాగా మే 23న, 28న జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలతో సహా ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మే 4న వెల్లడి కానున్నాయి.






