Brahmamudi: కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన ధాన్యం..

by Prasanna |
Brahmamudi: కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన ధాన్యం..
X

దిశ, వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

'నీ కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయింది ఎవరి కోసం నీ కోసమే కదా.. నచ్చజెప్పి అవమానించి పంపింది ఎవరు? నువ్వు.. మరి ఇప్పుడు తీసుకొచ్చే బాధ్యత కూడా నీదే.. పిలవాల్సింది నువ్వే’ అంటూ క్లారిటీగా చెబుతుంది ఇందిరా దేవి. దాంతో, కోపం వచ్చి ప్రకాశం భార్యను తిట్టి.. ‘పదా వెళ్లి పండుగకు పిలుద్దాం’ అని అంటాడు. వెంటనే అపర్ణా దేవి.. ‘మీ కొడుకును మాత్రమే కాదు కోడల్ని కూడా పిలవాలి ధాన్యలక్ష్మీ’ అని అంటుంది. పిలవకపోతే ఊరుకుంటానా.. ‘పిలుస్తుందిలే వదినా.. లేదంటే వాడు రాడు ’ అని తిట్టుకుంటూ కళ్యాణ్ ఇంటికి తీసుకుని వెళ్తాడు ప్రకాశం.

ఇక, కావ్యను నేను పిలుస్తాను అంటూ ఇందిరా దేవి అంటుంది. మొత్తానికీ, కళావతి ఇంటికి వెళ్లి .. కనకంతో కలసి కావ్యను ఒప్పిస్తుంది ఇందిరా దేవి. ఇంకో వైపు ప్రకాశం, ధాన్యం వెళ్లేసరికి అప్పూ, కళ్యాణ్‌లు ఇంట్లో పోటీ పడుతూ ఉంటారు. వాళ్లను చూసి ప్రకాశం సంతోషిస్తాడు. వారిని చూసిన అప్పూ లేచి మావయ్యా అని అంటుంది ‘ఎవరొచ్చారో చూడండి’ అంటూ ధాన్యాన్ని చూపించబోతుంటే.. ధాన్యం పక్కనే ఉండదు. గోడ వెనక్కి నిలబడి.. దాక్కొని ‘ఇక్కడే ఉన్నాను’ అని అంటుంది. ఇక్కడ ఉండమంటే .. అక్కడ ఎందుకున్నావ్ .. ఇటు రా గుమ్మం వైపుకు అని ప్రకాశం పిలుస్తాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed