- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మహా శివరాత్రి పండుగ రోజు విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన దండ్ల శ్రీనివాస్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పండుగ రోజు కావడంతో ట్రాక్టర్ ను వాగులో కడుక్కోవాలని ట్రాక్టర్ పై అతని కూతురు సింధు, కుమారుడు సిద్దార్థ ను డ్రైవర్ సీటు పక్కన కూర్చోబెట్టుకొని తిరిగి వస్తుండగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద అతని కుమారుడు సిద్దార్థ (3) ట్రాక్టర్‌పై నుంచి జారి కింద పడ్డాడు.
దీంతో ట్రాక్టర్ మధ్య టైరు బాలుడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. పండగపూట కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ప్రమాదం సంభవించిందని ఎస్ఐ. రజినీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.






