- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల పై సంచలన విషయాలను బయటపెట్టిన బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్
భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే

దిశ, వెబ్ డెస్క్: భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ (Mary Kom) ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె విడాకులు (divorce) తీసుకోవడంపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ క్రమంలో మేరీ కోమ్ స్పందిస్తూ.. తన విడాకులపై సంచలన విషయాలను బయటపెట్టారు. తన భర్త ఆన్లర్ (ఓంకోలర్) తనను ఆర్థికంగా దారుణంగా మోసం చేశారని, తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను ఆమెకు తెలియకుండా తన పేరు మీదకు మార్చుకున్నారని మేరీ కోమ్ ఆరోపించారు. ఆస్తులను తనఖా పెట్టి ఆన్లర్ భారీగా అప్పులు చేశారని, దీనివల్ల తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
2022 కామన్వెల్త్ గేమ్స్ సమయంలో గాయపడి మంచానికే పరిమితమైనప్పుడు, తన ఆర్థిక వ్యవహారాల గురించి ఆరా తీయగా ఈ చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిగత విషయాలు రచ్చకెక్కకూడదని ఇంతకాలం మౌనంగా ఉండటానికి కారణమని చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వం పై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంతో ఇప్పుడు నిజం చెప్పక తప్పలేదని మేరీ కోమ్ స్పష్టం చేశారు. తన గురించి ఆన్లర్ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, తాను డబ్బు కోసం ఆశపడే వ్యక్తిని కాదని, బాధితురాలిని అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్‌లోనే ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో కోమ్ సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నట్లు ఆమె ఇదివరకే వెల్లడించారు.






