ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : డాక్టర్ గోపాలరావు

by Batti.Sumithra |

ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పై ప్రజలలో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజలలో నమ్మకం కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గోపాల్ రావు అన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : డాక్టర్ గోపాలరావు
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పై ప్రజలలో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజలలో నమ్మకం కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గోపాల్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం పెరిగేలా ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని, వ్యాధుల పట్ల జిల్లా స్థాయిలో రేపిడ్ యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. మలేరియా డెంగ్యూ వ్యాధుల పై గ్రామస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు నిరంతర వైద్య శిబిరాలు నిర్వహించాలని, జ్వరంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి రక్త నమూనాను సేకరించి పరీక్షించాలని సూచించారు. గ్రామాలలో దోమల నివారణ గాను పరిసరాల పరిశుభ్రత, మురికి కాలువల శుభ్రత ఇంటి పరిసరాల పరిశుభ్రతల పై ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కీటక జనిత నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవితేజ, ఏఎంఓ దుర్గారావు, మాస్ మీడియా అధికారి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Next Story