- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుల్‌పై దాడి చేసిన మహిళలు... యూనిఫాం చిరిగినా కూడా వదలకుండా.. (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొన్నది. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై మహిళలు దాడి చేశారు. యునిఫామ్ చిరిగినా కూడా వదలకుండా అతడిపై దాడి చేశారు...bouncers attack womens in front of wine shop in Delhi

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొన్నది. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై మహిళలు దాడి చేశారు. యునిఫామ్ చిరిగినా కూడా వదలకుండా అతడిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఢిల్లీలోని ఓ వైన్ షాపు వద్దకు అర్ధరాత్రి పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. వైన్ షాప్ మూసివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైన్ షాపు బౌన్సర్లు వారిపై దాడి చేశారు. దీంతో వారు కేకలు వేయడంతో ఆ పక్కనే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నాడు. అనంతరం వారికి సర్ధిచెబుతున్న క్రమంలో మహిళలు అతడిపై దాడి చేశారు. యూనిఫాం చిరిగినా కూడా వదలకుండా దాడి చేశారు. విషయం పోలీసులకు తెలవడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అనంతరం ఈ కేసులో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






