Borugadda Anil Kumar : బోరుగడ్డ అనిల్ అరెస్ట్!

by Phanindra |   (  Updated:2024-10-17 15:54:28  IST  )

వైసీపీ హయాంలో విపక్ష నేతలపై నోటికొచ్చినట్లు దూషణలు

Borugadda Anil Kumar : బోరుగడ్డ అనిల్ అరెస్ట్!
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ హయాంలో రెచ్చిపోయి ప్రతిపక్ష నేతలను ఇష్టానుసారంగా దూషించిన బోరుగడ్డ అనిల్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నగరంలో పలు విద్యాసంస్థల అధినేత కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను భారీ మొత్తం డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం.

Next Story