- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టింది పాకిస్తాన్‌లో.. కట్ చేస్తే భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగం
నకిలీ ధృవీకరణ పత్రాలతో ఒక మహిళ భారత్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ ధృవీకరణ పత్రాలతో ఒక మహిళ భారత్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... మహిరా అఖ్తర్ (Mahira Akhtar) అనే మహిళ తన పేరును ఫర్జానా (Farzana)గా మార్చుకుని స్థానిక భారతీయ మహిళగా చలామణి అయింది. భారతదేశానికి చెందిన నకిలీ గుర్తింపు పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లను సృష్టించి, విద్యాశాఖలో టీచర్ ఉద్యోగం సాధించి గత 30 ఏళ్లుగా ఎవరికి అనుమానం రాకుండా విధులు నిర్వర్తిస్తోంది.
ఇటీవల విద్యాశాఖ చేపట్టిన అంతర్గత దర్యాప్తు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఫర్జానా సమర్పించిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై లోతైన విచారణ చేపట్టగా, ఆమె ప్రాథమికంగా పాకిస్తాన్ జాతీయురాలని తేలింది. అక్రమ మార్గాల్లో భారత్‌లోకి ప్రవేశించి, ఇక్కడి స్థానిక పత్రాలను ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ అయింది. ఆమె అసలు పేరు మహిరా అఖ్తర్ అని, గుర్తింపు మార్చడానికే ఫర్జానాగా పేరు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం బయటపడటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిని తీవ్ర నేరంగా భావించి, ఫర్జానాను వెంటనే విధుల నుంచి తొలగించారు. అదే విధంగా ఫోర్జరీ, మోసం, విదేశీయుల చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆమె పొందిన జీతభత్యాలను కూడా రికవరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






