పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన డాగ్, బాంబ్ స్వ్కాడ్

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ ఈ-మెయిల్ ద్వారా అందుతున్న బాంబు బెదిరింపులు అటు పోలీసులతో పాటు సాధారణ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన డాగ్, బాంబ్ స్వ్కాడ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ ఈ-మెయిల్ ద్వారా అందుతున్న బాంబు బెదిరింపులు అటు పోలీసులతో పాటు సాధారణ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని పలు పాఠశాలు, నోయిడా (Noida)లోని శివ్ నాడార్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి.

దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు స్థానిక పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీమ్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాఠశాల యాజమాన్యాలు తక్షణమే స్కూళ్లను ఖాళీ చేయించాయి. చాలాచోట్ల తల్లిదండ్రులను పిలిపించి పిల్లలను ఇంటికి పంపించివేశారు. ప్రస్తుతం పోలీసులు పాఠశాల ప్రాంగణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అసలు ఈ-మెయిల్ ఎవరు పంపారు.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Next Story