- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. హైజాక్ చేస్తామని దుండగుల హెచ్చరిక
బాంబు బెదింపులతో విమానయాన సంస్థలతో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాంబు బెదింపులతో విమానయాన సంస్థలతో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కువైట్ (Kuwait) నుంచి ఢిల్లీ (Delhi)కి బయలుదేరిన ఇండిగో విమానానికి (IndiGo flight) బాంబు బెదిరింపు రావడంతో ఇవాళ ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అయితే, విమానంలోని వాష్‌రూమ్‌లో ఓ టిష్యూ పేపర్ మీద ‘విమానంలో బాంబు ఉంది, హైజాక్ చేస్తాం’ అని రాసి ఉండటాన్ని ఫ్లైట్ క్రూ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం వెంటనే ఫ్లైట్‌లోని ప్రయాణికులందరినీ కిందకు దించి, భద్రతా దళాలు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
Next Story






