జమ్మూ కశ్మీర్‌లో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన ఆర్మీ!

by Malleboina Mahesh |

జమ్మూ కశ్మీర్‌లో భారీ ప్రమాదం తప్పింది. పూంచ్‌లో సాధరణ తనిఖీల్లో ఐఈడీ బాంబును భద్రతా దళాలు గుర్తించారు. బాంబు స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసిన ఆర్మీ. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం.

జమ్మూ కశ్మీర్‌లో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన ఆర్మీ!
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని బాంబు కలకంగా మారింది. ఈ రోజు ఉదయం పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్ పరిధిలో భద్రతా దళాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచీని గుర్తించారు. దానిని తనిఖీ చేయగా అందులో అత్యంత శక్తివంతమైన ఐఈడీ (Improvised Explosive Device) ఉన్నట్లు తేలింది. దీంతో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS) హుటాహుటిన అక్కడికి చేరుకుని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఆ బాంబును నిర్మానుష్య ప్రాంతంలో సురక్షితంగా పేల్చివేసి నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ బాంబును అమర్చారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో భద్రతను మరింత కఠినతరం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

Next Story