- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Salman Khan: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ అగ్ర హీరో..?
బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్(Bollywood's famous hero Salman Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్(Bollywood's famous hero Salman Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో సికిందర్(Sikander) మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(National Crush Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ హీరో అంతర్జాతీయ ప్రాజెక్టులోకి అడుగుపెట్టబోతున్నాడని సోషల్ మీడియా టాక్. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ..అభిమానులకు మాత్రం ఫుల్ ఖుషీ అవుతుంది.
ఆల్రెడీ సల్మాన్ హాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడట. ఇప్పటికే ప్రాజెక్టు కోసం సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఈ మూవీ సౌదీ అరేబియా(Saudi Arabia)లో షూటింగ్ జరగనుందట. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt) కూడా కనిపించనున్నారట. ఈ మూవీ షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ టీమ్ తో కలిసి రియాద్‌కు బయల్దేరనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త విన్న ఫ్యాన్స్ హ్యాపీ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషకరమైన విషయమంటూ ఎగిరిగంతులేస్తున్నారు. ఇక ఈ హీరో నటిస్తూన్న సికిందర్ ఏప్రిల్‌లో ఈద్ సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
- Tags
- Salman Khan






