క్యూట్ కపుల్ బ్రేకప్.. షాక్‌లో ఫ్యాన్స్..?

by Dishafeatures2 |
క్యూట్ కపుల్ బ్రేకప్.. షాక్‌లో ఫ్యాన్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: తమ అభిమాను హీరో, హీరోయిన్‌లు ఎవరైనా జంటగా ఉంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే విధంగా వారు విడిపోయినా అభిమానులే ఎక్కువ బాధపడుతుంటారు. టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పుడు కూడా అక్కినేని, సమంత అభిమానులు తీవ్రంగా బాధ పడ్డారు. అయితే తాజాగా మరో క్యూట్ కపుల్ విడిపోయిందట. ఈ విషయం తెలియడంతో అభిమానులు షాక్‌ తిన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన రూమర్‌డ్ బాయ్ ఫ్రెండ్ ఇషాన్ ఖతర్‌తో బ్రేకప్ చేసుకుందట. వీరి ప్రేమ రూమరే అయినా వీరిద్దరు అనేక పార్టీల్లో, వెకేషన్స్‌లో కలిసే కనిపించారు.

కానీ ఇప్పటి వరకు వారిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి ఎక్కడూ ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రస్తుతం వస్తున్న వారి బ్రేకప్ వార్తలే నెట్టింట హాట్ టాపిక్‌. అయితే తాజాగా షాహిద్ కపూర్ బర్త్ డే వేడుకల్లో వీరిద్దరు కలిసి కనిపించడంతో షాహిద్ ఫ్యామిలీ అనన్యకు ఓకే చెప్పేసిందంటూ టాక్ వచ్చింది. కానీ తాజాగా వీరిద్దరూ బ్రేకప్ అనడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఇదే చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడైనా వీరు వారి రిలేషన్‌షిప్, బ్రేకప్‌పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Next Story

Most Viewed