- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తారామతి రిసార్ట్ డ్రగ్ కేసు.. బాలీవుడ్ నటుడికి పాజిటివ్
హైదరాబాద్ శివార్లలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన డ్రగ్ పార్టీ వ్యవహారం నగరంలో కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివార్లలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్ పార్టీ వ్యవహారం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), గోల్కొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో, పార్టీలో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. సుమారు 300 మంది పాల్గొన్న ఈ వేడుకలో కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుండి వచ్చిన యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో పట్టుబడిన వారిలో బాలీవుడ్ నటుడు, మోడల్ అబ్దుల్ సర్వర్ ఉండటం సంచలనంగా మారింది. పోలీసులు మొత్తం 35 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, అబ్దుల్ సర్వర్‌తో పాటు యోగేశ్వర్, అభినాశ్ ఫణి, బ్రెట్ జాసన్, నిహార్-ఆషి అనే భార్యాభర్తలు గంజాయి, కొకైన్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. డీజే జాసన్ ప్రోత్సాహంతోనే ఈ పార్టీలో డ్రగ్స్ వాడకం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. నిందితులందరిపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి, ఈ ముఠాకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.






