షాకింగ్.. ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు

by Malleboina Mahesh |

అద్దె ఇంట్లో భార్యాపిల్లల మృతదేహాలు నేలపై, ఫ్యాన్‌కు వేలాడుతూ భర్త.. ఐదుగురి మృతితో సామూహిక ఆత్మహత్య సంచలనంగా మారింది.

షాకింగ్.. ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. తికారాపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోన్న ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ కుటుంబ పెద్ద అయిన సాజిద్ అలీ మృతదేహం గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆయన భార్య, ముగ్గురు చిన్న పిల్లల మృతదేహాలు గదిలోని నేలపై పడి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా ఇది సామూహిక ఆత్మహత్య (Collective Suicide) అయ్యి ఉంటుందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. మొదట భార్య పిల్లలకు విషమిచ్చి చంపి, ఆ తర్వాత సాజిద్ అలీ ఉరి వేసుకుని ఉంటాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఈ విషాద ఘటన స్థానిక నివాసితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Next Story