- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగాళాఖాతంలో పడవలు మునక.. 500 మంది మృతి!
మయన్మార్ మైనార్టీలైన రోహింగ్యాలు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్ మైనార్టీలైన రోహింగ్యాలు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి (UNHCR), అంతర్జాతీయ వసల సంస్థ (IOM) సంయుక్తంగా ప్రకటించాయి. జూన్ చివరి వారంలో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్ర తీరం నుండి మెరుగైన ఆశ్రయం కోసం ఈ పడవలు బయలుదేరగా, అందులోని ప్రయాణికులలో అత్యధికులు రోహింగ్యాలే కాకుండా బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల నుండి వచ్చిన కొందరు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ ప్రమాదాల వివరాల్లోకి వెళితే.. సుమారు 250 మంది ప్రయాణికులతో బయలుదేరిన మొదటి పడవ ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే తీరంతో సంబంధాలు కోల్పోయి సముద్రంలో మునిగిపోగా, 280 మందితో వెళ్తున్న రెండవ పడవ జులై 8వ తేదీన అయేయార్వాడీ తీర ప్రాంతంలో మునిగిపోయింది. అంతర్జాతీయ సంస్థల ప్రాథమిక దర్యాప్తు నివేదికల ప్రకారం, ఈ రెండు పడవల్లోని ప్రయాణికులు ఎవరూ బతికే అవకాశం లేదని, అందరూ సముద్రంలో మునిగి మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మెరుగైన జీవితం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లో వలస వెళ్తూ, ఇలా తరచూ వందలాది మంది అభాగ్యులు సముద్ర గర్భంలో కలిసిపోతుండటం పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశాయి.






