HIV కి అడ్డాగా మారిన అందాల దీవి.. సంచలనంగా మారిన "బ్లూటూత్ ట్రెండ్"

by Muthe.Rajitha |

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ట్రెండ్.. "బ్లూటూత్ ట్రెండ్".

HIV కి అడ్డాగా మారిన అందాల దీవి.. సంచలనంగా మారిన బ్లూటూత్ ట్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ట్రెండ్.. "బ్లూటూత్ ట్రెండ్". ఇప్పుడు ఈ ట్రెండ్ వల్లే అందమైన ఫిజీ దీవి HIV కి అడ్డాగా మారింది. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్లూటూత్ ట్రెండ్ పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు బ్లూటూత్ ట్రెండ్ ఏంటీ అనుకుంటున్నారా? ఈ ట్రెండ్ మహమ్మారి వ్యాధి వ్యాప్తికి ఎలా కారణం అయిందో తెలుసుకుందాం. ఫిజీ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న దేశం. జనాభా దాదాపు 10 లక్షల కంటే తక్కువ. ఇక్కడి అందమైన తెల్లటి బీచ్‌లు, స్పష్టమైన నీరు, కొరల్ రీఫ్‌లు, రిసార్ట్‌లు వల్ల ప్రపంచవ్యాప్తంగా హనీమూన్‌కు వెళ్లే కపుల్స్‌ వారి రొమాంటిక్ వెకేషన్ కోసం ఇక్కడికి వస్తారు.

అసలేంటీ "బ్లూటూత్ ట్రెండ్"

ఇప్పుడు ఈ అందమైన దేశంలో బ్లూటూత్ ట్రెండ్ వలన HIV వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బ్లూటూత్ ట్రెండ్ అనేది డ్రగ్స్ యూజర్లలో వచ్చిన అత్యంత భయంకరమైన పద్ధతి. బ్లూటూత్ ట్రెండ్ అంటే ఫోన్‌లో ఉండే బ్లూటూత్ టెక్నాలజీతో సంబందించినది కాదు. డ్రగ్స్ యూజర్లు క్రిస్టల్ మెథ్ (మెథాంఫెటమైన్) లాంటి హెవీ డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటారు. డబ్బు లేని వాళ్లు, డ్రగ్ కొనుక్కోలేక డ్రగ్ ఇంజెక్ట్ చేసుకున్న వ్యక్తుల రక్తాన్ని సిరంజితో తీసి, తమకు ఇంజెక్ట్ చేసుకుంటారు. ఇలా ఒకరి రక్తాన్ని మరొకరు తీసుకోవడం వల్ల హై అనుభూతి వస్తుందని వాళ్లు భావిస్తారు. అంటే ఇది బ్లూటూత్ కనెక్షన్ వలె ఒకరి నుంచి మరొకరికి రక్తం "ట్రాన్స్‌ఫర్" అవుతుంది.

HIV ఔట్‌బ్రేక్

కొందరు దీన్ని "ఫ్లాష్ బ్లడ్" లేదా "హాట్‌స్పాటింగ్" అని కూడా అంటారు. అయితే ఇది చాలా డేంజరస్ పద్ధతి. ఎందుకంటే రక్తం ద్వారా HIV, హెపటైటిస్ వంటి వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయి. ఫిజీలో ఈ ట్రెండ్ వల్ల HIV కేసులు భారీగా పెరిగాయి. 2014లో ఫిజీలో HIV పాజిటివ్ ఉన్నవాళ్లు 500 కంటే తక్కువ మంది మాత్రమే ఉండేవారు. కానీ 2024 నాటికి అది దాదాపు 6,000కి చేరుకుంది. అంటే పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. ఒక్క 2024లోనే 1500 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది మునుపటి సగటు కంటే 13 రెట్లు ఎక్కువ. 2025 మొదటి ఆరునెలల్లో దాదాపు 1300 కేసులు నమోదవడంతో అక్కడి ప్రభుత్వం HIV ఔట్‌బ్రేక్ అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ దేశాల్లో అతి వేగంగా HIV పెరుగుతున్న సమస్యాత్మక దేశాల్లో ఫిజీ ముందు వరుసలో నిలిచింది.

పేదరికమే శాపం

ఆ అందమైన దీవిలోని యువత మాత్రమే కాదు, 13 ఏళ్ల పిల్లలు కూడా ఈ బ్లూటూత్ ఎఫెక్ట్ వల్ల మహమ్మారి బారిన పడ్డారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వలన క్రిస్టల్ మెథ్ డ్రగ్ ఫిజీలో సులభంగా లభిస్తోంది. అత్యంత పేదరికం, డబ్బు లేకపోవడం వల్ల ఈ బ్లూటూత్ పద్ధతి పాపులర్ అయింది. ఫిజీ హెల్త్ అధికారులు, WHO, UNAIDS వంటి సంస్థలు ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెబుతున్నారు. డ్రగ్ యూజర్లలో 50% మంది కాంటమినేటెడ్ సిరంజిలతో ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా చెమ్‌సెక్స్ (డ్రగ్స్‌తో సెక్స్), అసేఫ్ సెక్స్ వల్ల కూడా HIV వ్యాప్తి పెరుగుతోంది. ఫిజీలో హెల్త్ సిస్టమ్ ఓవర్‌లోడ్ అవుతోంది. ట్రీట్‌మెంట్, ప్రివెన్షన్ సరిగా అమలు కావడం లేదు.

హనీమూన్ స్పాట్‌ కాదు ఎయిడ్స్ స్పాట్

ఈ ట్రెండ్ వల్ల ఫిజీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటోంది. హనీమూన్ స్పాట్‌గా పాపులర్ అయిన దేశం ఇప్పుడు HIV హాట్‌స్పాట్‌గా మారిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య ఫిజీలో మాత్రమే కాదు, ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో కూడా ఇలాంటి బ్లూటూత్ ట్రెండ్ వల్ల HIV కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ హెల్త్ ఆర్గనైజేషన్, స్థానిక ప్రభుత్వాలతో కలిసి డ్రగ్ పై అవగాహన కార్యక్రమాలు, స్టెరైల్ సిరంజిలు అందించడం, HIV అవేర్నెస్, ట్రీట్‌మెంట్ సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ.. ఆయా దేశాల ముందు ఇదొక పెద్ద సవాలుగా మారింది.

Next Story