- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాక్ మార్కెట్‌లో 'బ్లాక్ థర్స్ డే': వరుస లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!
వరుస లాభాలకు బ్రేక్! 1500 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్. ప్రస్తుతం 75,085 వద్ద ట్రేడింగ్. నిఫ్టీ 23,286 వద్దకు పతనం. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!

దిశ, వెబ్ డెస్క్: వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు (Stock markets) ఒక్కసారిగా కుప్పకూలాయి. వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ.. మరో సారి స్టాక్ మార్కెట్‌లో 'బ్లాక్ థర్స్ డే' భారీ నష్టాలను మిగిల్చింది. గత మూడు రోజులుగా వరుస లాభాలతో కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు, నేడు ఊహించని భారీ పతనాన్ని చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడం తో మార్కెట్ ప్రారంభమే భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లకు పైగా పతనమై ప్రస్తుతం 75,085 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 23,286.40 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
వరుసగా మూడు సెషన్ల పాటు లాభాలతో ముగిసి, కొత్త రికార్డుల దిశగా వెళ్తున్న మార్కెట్‌కు ఈ పతనం ఒక్కసారిగా బ్రేక్ వేసింది. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు భారీగా నష్టం పోతుండటంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది. బుల్ రన్ కొనసాగుతుందని ఆశించిన ట్రేడర్లకు ఈ భారీ అమ్మకాలు షాక్ ఇచ్చాయి. గ్లోబల్ మార్కెట్లలోని అనిశ్చితి, ప్రాఫిట్ బుకింగ్ వంటి కారణాలే మార్కెట్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






