Janam Gosa - BJP Bharosa: వాయిదా పడిన జనంగోస- బీజేపీ భరోసా కార్యక్రమం

by samatah |   (  Updated:2022-07-26 09:56:24  IST  )

BJP's Janam gosa - BJP Bharosa Postponed Due to Rain in Mahbubnagar| దేవరకద్ర నియోజకవర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో నిర్వహిస్తున్న జనంగోస- బీజేపీ భరోసా కార్యక్రమాన్ని వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా

BJPs Janam gosa - BJP Bharosa Postponed Due to Rain in Mahbubnagar
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : BJP's Janam gosa - BJP Bharosa Postponed Due to Rain in Mahbubnagar| దేవరకద్ర నియోజకవర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో నిర్వహిస్తున్న జనంగోస- బీజేపీ భరోసా కార్యక్రమాన్ని వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాలు కురుస్తున్న కారణంగా నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, మంగళవారం సైతం వర్షం కురవడం, రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న కారణంగా జనంగోస, బీజేపీ భరోసా కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 31వ తేదీ నుండి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పవన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దేవరకద్ర బాలన్న పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: భగ్గుమన్న మల్లంపల్లి.. జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

Next Story