- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ ఫాల్టా రీపోలింగ్‌లో బీజేపీ భారీ లీడ్
బెంగాల్ ఫాల్టా అసెంబ్లీ రీపోలింగ్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా భారీ లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ టీఎంసీ ఖేల్ ఖతమైందని బీజేపీ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని ఫాల్టా నియోజకవర్గం (Falta Constituency) రీ పోలింగ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి భారీ ఆధిక్యంలో దుసుకుపోతున్నారు. ఏప్రిల్ 29న జరిగిన రెండో విడత సాధారణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఈ నియోజకవర్గంలో ఈవీఎంల దుర్వినియోగం, ఇతర తీవ్రమైన ఎన్నికల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అక్కడ జరిగిన పోలింగ్‌ను రద్దు చేసింది. అనంతరం నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల మే 21న తిరిగి రీ పోలింగ్ (Repolling) నిర్వహించారు. ఆ రీపోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియే ఈరోజు (మే 24) ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ అభ్యర్థి స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తుండటంతో కౌంటింగ్ కేంద్రం వెలుపల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా లీడింగ్‌లో ఉండటంపై ఆ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఫాల్టాలో భయాందోళనల రాజకీయాలకు కాలం చెల్లింది. మా లెక్కల ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రీపోలింగ్ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగింది. ప్రజలు తమ స్వేచ్ఛా హక్కును ఉపయోగించుకున్నారు. ఈ ఫలితాలతో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిజ జీవితంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, గతంలో ఇక్కడ నెలకొన్న భయానక వాతావరణానికి ఓటర్లు తమ తీర్పుతో సమాధానం చెప్పారు. టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ ఇక్కడ పూర్తిగా అప్రస్తుతమైపోయారు (Irrelevant), అక్రమాలకు పాల్పడిన వారు చట్టప్రకారం కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. మేము ఇక్కడ కనీసం 2 లక్షల నుంచి 2.10 లక్షల భారీ ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించబోతున్నాం" అని ధీమా వ్యక్తం చేశారు.






