కేజీబీవీ పాఠశాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

by Ratna Kumari |

నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా.బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం సందర్శించారు.

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి
X

దిశ, నర్వ : నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా.బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మొరం ఫిల్లింగ్, పైప్‌లైన్ మరమ్మతులు, హైమాస్ట్ లైట్, ఆర్‌వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు, విద్యార్థులకు సకాలంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు డా. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలను మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్వ మండల ప్రధాన కార్యదర్శి విజయ్‌రామ్, సీనియర్ నాయకుడు సాకలి బొజ్జన్న, వార్డు సభ్యుడు పల్లె రాంరెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకుడు హరికృష్ణతో పాటు పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story