- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్
by samatah |
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం జరగనున్నది. పార్లమెంటు అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం జరగనున్నది. పార్లమెంటు అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటిపై జరిగే చర్చలో పాల్గొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నది. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపికచేసే విషయాన్ని కూడా చర్చించనున్నది. ఈ సమావేశం తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును అధికారికంగా ఎన్డీఏ తరఫున ప్రకటించే అవకాశం ఉన్నది.
Next Story






