- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ సమక్షంలో MP డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
ఎంవీఎస్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) పాల్గొన్నారు. ఎంవీఎస్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ‘ఈ వేదికపై ఉన్నవాళ్లంతా నా ఓటమికి గట్టిగా పనిచేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం. కేంద్రం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తా. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిసి ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయాలి. పాలమూరు అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే’ అని డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో మహబూబ్‌నగర్ ట్రిపుల్‌ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.






