Tamil Nadu Bifurcation: తమిళనాడును రెండుగా విభజిస్తాం: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
BJP MLA Nagendran Shocking Comments On Tamil Nadu Bifurcation
X

దిశ, వెబ్‌డెస్క్: BJP MLA Nagendran Shocking Comments On Tamil Nadu Bifurcation| తమిళనాడులో బీజేపీ, అధికార డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల డీఎంకే ఎంపీ రాజా తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని.. లేదంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన మాటలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే నాగేంద్రన్, ఎంపీ రాజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. స్వతంత్ర తమిళనాడు కోసం డీఎంకే పోరాడితే.. తమిళనాడు రాష్ట్ర విభజన కోసం మేం పోరాడుతామంటూ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలా తమిళనాడును రెండుగా విభజిస్తామని అన్నారు. అంతేకాకుండా తమిళనాడు విభజనకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


Next Story