- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల కోసం.. ప్రజల మధ్యే
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఎంపీగా విజయవంతంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఆయనను కలిసి ఘనంగా అభినందించారు.

దిశ , చంపాపేట్ : మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఎంపీగా విజయవంతంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఆయనను కలిసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఈటల రాజేందర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన మరింత విజయాలు సాధించి, నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి, గంగాని శ్రీనివాస్, ఎరుకల మల్లేష్ గౌడ్, దాసరి జయప్రకాశ్, మంచి రాజేష్ కుమార్, కటారి విష్ణువర్ధన్ రావు, గంగబోయిన నవీన్ యాదవ్, పంగ శ్రీకాంత్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. “ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతాను అని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.






