- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణికులు.. తప్పిన పెను ప్రమాదం
by Vemula.Srinu Prasad |
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా సాంకేతిక లోపానికి గురైంది...

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) కంకిపాడు మండలం(Kankipadu Mandal) తెన్నేరు సమీపం(Near Tenneru)లో ఓ ఆర్టీసీ బస్సు(RTC bus)కు ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా సాంకేతిక లోపానికి గురైంది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు
కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కాగా, తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






