రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: మండల వ్యవసాయ అధికారి

by Kodari Anjali |

వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులు వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటల వైపు మోగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి అన్నారు.

రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: మండల వ్యవసాయ అధికారి
X

దిశ, సుల్తానాబాద్: వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులు వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటల వైపు మోగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి అన్నారు. భూసార పరిరక్షణ ధ్యేయంగా వ్యవసాయ శాఖ వారు నిర్వహిస్తున్న ఖేతి బచావో భూసార పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అల్లీపూర్, రేగడిమద్దికుంట, రామునిపల్లి, కనుకుల, మంచరమి, సుద్దాల గ్రామ సభల్లో రైతులకు అవగాహన అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలైన జొన్న, అలసంద, పెసర, మినుము, కంది వంటి పంటలు వేసుకోవాలని, నీటి వసతి ఉన్న దగ్గర వరిలో స్వల్పకాలిక రకాలైన కే ఎన్ ఎం- 1638, జేజిఎల్- 1798, ఆర్ఎన్ఆర్- 15048, ఎం టి యు- 1010, కేఎన్ఎమ్- 118 రకాలను వేసుకోవాలని రైతులకు తెలిపారు. భూసార పరిరక్షణ కొరకు మట్టి నమూనాను సేకరించి ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన ఎరువులు వాడాలని, వరి కొయ్యకాలు కలబెట్టకుండా తిరిగి భూమిలో కలియ దున్నుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవితేజ, ప్రశాంత్, అనూష, పద్మ, ఆనందరావు, రైతులు పాల్గొన్నారు.

Next Story