- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆర్ఎస్ఎస్ నేపథ్యం బయటపడింది’.. సీఎం రేవంత్ రెడ్డిపై విజయన్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRAA) అంశంపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో హైడ్రా ఏర్పాటుపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRAA) అంశంపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో హైడ్రా ఏర్పాటుపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ‘హైడ్రా’ను హిట్లర్ స్ఫూర్తితో ఏర్పాటు చేశానని సీఎం రేవంత్ చెప్పడంపై కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఆయన ఫాసిస్ట్ మనస్తత్వాన్ని బట్టబయలు చేస్తోందని విమర్శించారు.
అసలేం జరిగిందంటే..?
శనివారం బెంగళూరులో ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో జరిగిన ‘హిందూ హడిల్’ సదస్సులో ‘ప్రజలచే, ప్రజల కోసం: తెలంగాణకు సుపరిపాలన’ అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా అనేది హిట్లర్‌కు ఇష్టమైన పదం. పేదలెవరైనా చెరువులను ఆక్రమిస్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ, పేరు, డబ్బున్నవాళ్లు యథేచ్ఛగా ఆక్రమిస్తుంటే నియంత్రించేందుకే ఈ హైడ్రా డ్రైవ్ ప్రారంభించాం. ఆక్రమణల కూల్చివేతల కోసం ఏకంగా 3 వేల మంది విశ్రాంత సైనికులను నియమించాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను ఆయన పూర్తిగా తప్పుబట్టారు. ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను స్థాపించిన ‘హైడ్రా’ను హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది ఏర్పాటు చేశానని గర్వంగా చెప్పుకోవడం నిజంగా దౌర్భాగ్యం (Appalling). ఈ వ్యాఖ్యలు ఆయన ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యాన్ని, ఫాసిస్ట్ మనస్తత్వాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం దేశ ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాలి’ అని విజయన్ డిమాండ్ చేశారు.






