- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగని అక్రమ నిర్మాణాలు...
by Taduka Kalyani |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలోని కొర్రెముల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొర్రెముల వాసులు సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

X
దిశ, ఘట్కేసర్ః మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలోని కొర్రెముల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొర్రెముల వాసులు సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొర్రెముల వాసులు మాట్లాడుతూ... సర్వే నెంబర్ 869లోని 11.33 ఎకరాల ప్రభుత్వ భూమిలో నకిలీ పట్టాలు సృష్టించి రాత్రికి రాత్రే ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంపై స్థానిక ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారి పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.
Next Story






