- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
'కేసీఆర్‌కు కంటిమీద కునుకుండటం లేదు'
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతోందని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ గ్రాఫ్ పెరుగుతుందని, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కేసీఆర్‌కు కంటిమీద కునుకుండటం లేదని ఎద్దేవా చేశారు. అందుకే మళ్ళీ ధాన్యం విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందస్తుకు వెళ్ళబోమని కేసీఆర్ చెప్పాడు, అసలు ముందస్తుకు వెళ్లే హక్కు నికెక్కడిదని ప్రశ్నించారు. మీకున్న హక్కు కేవలం అసెంబ్లీ రద్దు వరకే అని, ఎన్నికల గురించి ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని సూచించారు.
జమిలి ఎన్నికలు జరగాలనే మేము కోరుకుంటున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే హక్కు రాష్ట్రాలకు ఉందని, ఎన్టీఆర్ కూడా ఎస్సీలకు 14 శాతం నుంచి 15 కు ఇలాగే పెంచారని గుర్తుచేశారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని అంబేద్కర్ చెబితే మత పరమైన రిజర్వేషన్లు కావాలని కోరడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ''నీ కొడుకు కంటోన్మెంట్‌కు కరెంట్ కట్ చేస్తా అన్నాడు. నీ బిడ్డ కవిత హైదరాబాద్ భారత్‌లో కంటోన్మెంట్ భాగం కాదని చెప్పింది. రజాకార్, నిజాం దారుణాలపై ఫైల్స్ కూడా తీయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్లను కోరుకుంటున్నాను. మీరంతా దారుస్సలాంకు బానిసలు.'' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.