- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుర‘పోరు’కు కమలనాథులు సన్నద్ధం.. ఐదు పట్టణాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్
మున్సిపల్ ఎన్నికలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఇటీవలే హైకమాండ్రాష్ట్రానికి ముగ్గురు ఇంచార్జీలను నియమించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఇటీవలే హైకమాండ్రాష్ట్రానికి ముగ్గురు ఇంచార్జీలను నియమించింది. వారి ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం సరళి ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీపెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. సభలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు పంపించినట్లు సీనియర్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నాయకత్వం, వివిధ రాష్ట్రలకు చెందిన మంత్రులు కూడా రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కరీంనగర్, నిజామాబాద్ సభలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, మహబూబ్‌నగర్‌లో జరిగే సభకు జేపీ నడ్డా, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రాజ్‌నాథ్ సింగ్హాజరుకానున్నారు. సభలను విజయవంతం చేసేలా పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్‌ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని మెజార్టీ సీట్లు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లాల నేతలకు సూచించారు.






