- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైన రోజు: రాంచందర్‌రావు
మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనకు వస్తున్నాడని.. ఇది తెలంగాణ పార్టీకి అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనకు వస్తున్నాడని.. ఇది తెలంగాణ పార్టీకి అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆయన పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సంస్థాగత సంకల్పాన్ని బలోపేతం చేసి, ప్రజలతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేయనుంది. 1984లో దేశవ్యాప్తంగా బీజేపీకి కేవలం రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చిన సందర్భంలో, వాటిలో ఒక స్థానం తెలంగాణ నుంచే రావడం ఒక చారిత్రక ఘట్టం అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. పార్టీ ప్రయాణం నిరంతర వృద్ధి, అచంచల నిబద్ధత, ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమని మోడీ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అపార విశ్వాసానికి, దేశ ప్రథమ సిద్ధాంతం, అభివృద్ధి ప్రజాస్వామ్య విలువలపై బీజేపీ అచంచల నిబద్ధతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితిన్ నబిన్ బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమ్మేళనం బూత్ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చే వేదికగా నిలవనుంది. పార్టీ సంస్థాగత బలానికి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, బిజెపి కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యకర్తల సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా పార్టీ కార్యకర్తలు నితిన్ నబిన్ ప్రసంగాన్ని వీక్షిస్తూ ఈ సమ్మేళనంలో వర్చువల్‌గా భాగస్వాములవుతారు.






