బెంగాల్, అస్సాంలో కమల వికాసం.. ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠ!

by Malleboina Mahesh |

ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన తరుణంలో ప్రధాని మోదీ నేడు సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

బెంగాల్, అస్సాంలో కమల వికాసం.. ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠ!
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP), ఎన్డీయే కూటమి అసాధారణ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోనున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో పార్టీ సాధించిన భారీ మెజార్టీతో పాటు ఉప ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విజయోత్సవ వేడుకల కోసం ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ట్రెండ్స్, ఫలితాల సరళిని బట్టి బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రంలో మెజార్టీ మార్కును దాటి అధికారాన్ని కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయంగా పార్టీ భావిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో కార్యకర్తల కృషి నీ కొనియాడడంతో పాటు, ఈ ఫలితాలు దేశ రాజకీయ భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని ప్రసంగం కోసం బీజేపీ శ్రేణులతో పాటు, దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story