Bindu Madhavi: ఆ హీరోతో సీక్రెట్ డేటింగ్ చేస్తున్న నటి.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 12 |
Bindu Madhavi: ఆ హీరోతో సీక్రెట్ డేటింగ్ చేస్తున్న నటి.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: తెలుగమ్మాయి బిందు మాధవి స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ డమ్ సంపాదించుకోలేక పోయింది. దీంతో ఐటమ్ సాంగ్స్ కూడా చేసిన ఈ భామ టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ పాపులర్‌ అయింది. ఇదిలావుంటే.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 'బిగ్ బాస్ నాన్ స్టాప్‌'తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బ్యూటీ తనదైన ఆటతీరుతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంది. కాగా ఈ రియాలిటీ షోలో తన ఆటను సపోర్ట్ చేస్తూ తమిళ యంగ్‌ హీరో హరీష్ కళ్యాణ్ ఓ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

'నా ప్రియమైన స్నేహితురాలు బిందు మాధవి కి శుభాకాంక్షలు. 'బిగ్ బాస్ నాన్ స్టాప్‌'లో బాగా ఆడుతున్నావ్' అంటూ తన మద్ధతు తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు గతంలోనూ వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు తెలుస్తుండగా.. తమిళ 'బిగ్ బాస్ సీజన్‌1'లో బిందు మాధవి, హరీష్ కళ్యాణ్ కంటెస్టెంట్‌గా ఉన్నప్పటినుంచే ఈ ప్రేమ చిగురించిందని నెటిజన్లు చెబుతున్నారు.

Next Story

Most Viewed