- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై బైండోవర్
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ మద్యం మత్తులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.

దిశ, కరీంనగర్ రూరల్ : బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ మద్యం మత్తులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ గ్రామంలో గత ఆదివారం ఏఎస్ఐ జయశంకర్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గ్రామానికి చెందిన కాల్వా సాయి ప్రణయ్, మేకల రాజుకుమార్, మేకల రఘు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ కనిపించారు.
పోలీసులు వారిని ప్రశ్నించగా, మద్యం మత్తులో ఉన్న ముగ్గురు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించి అక్కడి నుంచి పరారైనట్లు సీఐ తెలిపారు. గురువారం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ నర్సింగరావు ఎదుట హాజరుపరిచారు. అనంతరం ముగ్గురినీ బైండోవర్ చేసినట్లు సీఐ వెల్లడించారు. పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.






