ఎల్‌నినో ప్రభావం.. వరి, మిరపకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి

by Taduka Kalyani |

ఖరీఫ్ సీజన్‌లో చింతలపాలెం మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

ఎల్‌నినో ప్రభావం.. వరి, మిరపకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి
X

దిశ, చింతలపాలెం: ఖరీఫ్ సీజన్‌లో చింతలపాలెం మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు అధిక నీటి అవసరమున్న వరి, మిరప పంటల విస్తీర్ణాన్ని తగ్గించి, కంది, నువ్వులు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు దొండపాడు, బుగ్గమాదారం, కిష్టాపురం గ్రామాల్లో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి డి. శశాంక్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. జూలై 31లోపు PRG-716, WRG-255 స్వల్పకాలిక కంది విత్తనాలు, ఆగస్టు 7లోపు నువ్వుల విత్తనాలు విత్తాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు జె. దుర్గ భవాని, పీ. భవన్, రైతులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి అవగాహన సమావేశాలు నిర్వహించి రైతులకు పంటల ప్రణాళిక, నీటి పొదుపు పద్ధతులపై సూచనలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story